ఎన్నికలకు అభ్యర్థులు సహకరించాలి
NEWS Dec 12,2024 11:49 am
ఈనెల 18వ తేదీన జరగనున్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారి రాజేందర్ రెడ్డి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు ఐడి కార్డులు ఇస్తామని, కౌంటింగ్ కేంద్రాలలో అనుమతి ఉంటుందన్నారు. 20 మీటర్ల లోపు ఎవరూ ఉండ కూడదన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.