అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
NEWS Dec 12,2024 11:38 am
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా విద్య, వైద్యారోగ్య, పౌర సరఫరాలు, సహకార, పరిశ్రమలు తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.