ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి మోసం
NEWS Dec 11,2024 03:50 pm
నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మహిళను బురిడీ కొట్టించాడు. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి మోసానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ముజాహిద్ నగర్‌కు చెందిన నజియ సుల్తానా బిఎస్సి నర్సింగ్ కోర్స్ పూర్తి అప్లికేషన్ పెట్టింది. ఫోన్ చేసి మీ జాబ్ అప్లికేషన్ రిజెక్టు లిస్టులో ఉంది, నేను మీకు ఉద్యోగం వచ్చే విధంగా చేస్తాను అందుకు కొంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుందని మహిళతో బేరం మొదలుపెట్టాడు. 20వేలు ఫోన్ పే చేయించుకుని ఉదాయించాడు. దీంతో ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.