Logo
Download our app
గ్రూప్ 2 పరీక్షలను సజావుగా నిర్వహించాలీ
NEWS   Dec 12,2024 12:15 pm
గ్రూప్ 2 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.ఈ నెల 15,16న నిర్వహించనున్న గ్రూప్2 పరీక్షలకు జిల్లాలో 8080 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు నిర్మల్ పట్టణంలో 24 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, త్రాగునీరు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source