కరాటే గోల్డ్ మెడల్ విద్యార్థికి సన్మానం
NEWS Dec 11,2024 02:22 pm
మెట్ పల్లి పట్టణానికి చెందిన గోరుమంతుల శ్రీకేష్ కరాటే కటస్ విభాగంలో బంగారు పతకం సాధించి సందర్భంగా మెట్ పల్లి ఇందిరానగర్ మాల కుల సంఘ పెద్ద మనుషులు, కుల సంఘ సభ్యులు, బుద్దిస్ట్ సొసైటీ సొసైటీ సభ్యులు, ఎస్సీ ఎస్టీ జేఏసీ కోరుట్ల నియోజకవర్గం జేఏసీ సభ్యులు శాలువాతో సన్మానం చేసి అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్ట రాజేశ్వర్, సొమిడి రాజయ్య, దయ్యా నందయ్య, నిరటి నరేందర్, దయ్య రఘు, బర్ల సాయన్న, హన్మాండ్లు పాల్గొన్నారు.