3.5 కోట్ల విలువైన మత్తు పదార్థాలు ధ్వంసం
NEWS Dec 11,2024 05:37 am
నిజామాబాద్ జిల్లా పరిధిలో ఎక్స్సైజ్ శాఖ పరిధిలో పట్టుబడ్డ మత్తు పదార్థలను ధ్వంసం చేశారు. ఎక్స్సైజ్ డిప్యుటీ కమిషనర్ ఆదేశాల మేరకు గతేడాడీ పట్టుబడ్డ వాటిని ధ్వంసం చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ స్టేషన్ ఫరిధిలో 60 కేసులలలో పట్టుబడిన 3.5 కోట్ల విలువైన (1007.02) కేజీల ఎండు గంజాయి, (35) కేజీల గంజాయి చాక్లెట్లు, (7) కేజీల డయాజెపామ్, (8) కేజీల అల్ప్రాజోలం, (2) గంజాయి మొక్కలను జక్రాన్ పల్లి మండలం పడకల్ మేడికేర్ సర్వీస్ సెంటర్ లో ధ్వంసం చేశారు.