పవన్ కళ్యాణ్ కు ఉండవల్లి లేఖ
NEWS Dec 10,2024 11:47 am
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, సరిదిద్దే బాధ్యతను పవన్ తీసుకోవాలని కోరారు.. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన అధికారంలో ఉన్నాయని, కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టేందుకు పవన్ శ్రద్ధ పెట్టాలని అన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యను కొలిక్కి తీసుకురావాలని సూచించారు.