కుమార స్వామిపై షర్మిల కన్నెర్ర
NEWS Dec 10,2024 09:02 am
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి కుమార స్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అసలు ప్లాంట్ ప్రతిపాదనే లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఏపీ ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.