Logo
Download our app
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
NEWS   Dec 09,2024 07:37 am
సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీసు వద్ద గల సోనియాగాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వర్, మల్లేశం, మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source