Logo
Download our app
ఎన్‌సీఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించాలి
NEWS   Dec 09,2024 07:59 am
నిజామాబాద్ సారంగాపూర్‌ చక్కెర(ఎన్‌సీఎస్‌ఎఫ్‌) ఫ్యాక్టరీలో బెల్లం ఉత్పత్తి చేయాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్‌ ఆకుల పాపయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. దేశంలో బెల్లంకు డిమాండ్‌ ఉందని, దానిపై జీఎస్టీ, సీజీఎస్టీ లేనందున బెల్లం ఉత్పత్తికి మంచి అవకాశమని అన్నారు. మండలంలోని జలాల్‌పూర్‌లో చెరుకు రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల తప్పుడు విధానాలు, అధికారుల అలసత్వం కారణంగా సారంగాపూర్‌ చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source