పుష్ప-2 కేసులో ముగ్గురు అరెస్ట్
NEWS Dec 09,2024 02:50 am
పుష్ప-2 మూవీకి సంబంధించి తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ లను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. రిమాండ్ కు తరలించారు. అల్లు అర్జున్ కు నోటీసులు ఇస్తామన్నారు ఏసీపీ రమేష్ కుమార్.