ఆశాలు.. ఛలో హైదరాబాద్
NEWS Dec 08,2024 04:53 pm
ఆశా వర్కర్ల ఫిక్స్‌డ్ వేతనం 18,000 అమలు కోసం ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాహన్ తెలిపారు. ఆశా వర్కర్ల విస్తృత సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నా లెప్రసీ, పల్స్, పోలియో, టీబీ, కంటి వెలుగు డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. పారీతోషికం పేరుతో ఆశాలను వెట్టిచాకిరికి గురి చేస్తున్నారని అన్నారు. ఆశాలకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18 వేల రూపాయలు చెల్లించాలన్నారు.