మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి పరామర్శ
NEWS Dec 08,2024 02:37 pm
అనారోగ్యానికి గురైన రామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్‌ను ఆ పార్టీ నేతలు పరామార్శించారు. అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలుసుకొని జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నారేడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య భద్రత ముఖ్యమని, చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రగొత్తం రెడ్డి, రేకుల సత్యం తదితరులు పాల్గొన్నారు.