నిజామాబాద్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ
NEWS Dec 08,2024 02:36 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రబాబు నాయుడు కాలనీలోని యాదవ సంఘంలో కాంగ్రెస్ ప్రజా పాలన సభ నిర్వహించారు. ఏడాది విజయోత్సవాలు సందర్భంగా 9వ డివిజన్ అధ్యక్షుడు శోభన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేణుగోపాల్ చారి హాజరయ్యారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ హామీలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, కార్పొరేటర్ కుద్దుస, రత్నాకర్, విక్కీ యాదవ్ రాంభూపాల్, నంది వినయ్, జావేద్ అక్రమ్, రామకృష్ణ, రేవతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.