అయ్యప్ప స్వాములకు ఖుతుబొద్దీన్ అన్నదానం
NEWS Dec 08,2024 02:04 pm
మెట్ పల్లి పట్టణంలో అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదానం చేసి అందరికి ఆదర్శంగా నిలించాడు మెట్ పల్లి మర్కజి ఇంతేజామీ కమిటీ మిల్లతే ఇస్లామీయ అధ్యక్షుడు ఖుతుబొద్దీన్ పాషా. మెట్ పల్లి పట్టణంలోని టీపీసీసీ డెలికేట్ మెంబర్ కల్వకుంట్ల సుజితరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ తో పాటు పలువురు అయ్యప్ప స్వాములు, భక్తులకు కులమతాలకు అతీతంగా అన్నదానం చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు.