యాసంగిలో సన్నవడ్లు సాగు చేయాలి
NEWS Dec 08,2024 12:18 pm
రైతులు సన్నవడ్లు పండించి ₹ 500 బోనస్ పొందాలని మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ రైతులను సూచించారు. రైతులు ఎలాంటి సందేహం లేకుండా సన్నవడ్లు సాగుచేయాలని, లాభసాటి దిగుబడులు పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నరెడ్డి, మాజీ మెట్‌పల్లి మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఖతుబుద్దీన్, ఎండీ జాఫర్, కాటిపెల్లి మహేష్, గోల్కొండ ప్రవీణ్, అమ్ముల పవన్ తదితరులు పాల్గొన్నారు.