కామారెడ్డిలో బ్రహ్మనందం సందడి
NEWS Dec 08,2024 11:20 am
కామారెడ్డిలోని మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి హాస్యనటుడు బ్రహ్మానందం విచ్చేశారు. కుటుంబీకులతో కలిసి భోజనం చేశారు. బ్రహ్మానందం వచ్చిన విషయం తెలుసుకున్న, అభిమానులు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి సెల్ఫీలు ఫోటోలు దిగారు. అనంతంరం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ వెంచర్ బ్రోచర్ ను ఆవిష్కరించారు కమెడియన్.