ఆర్మూర్‌లో కుక్కల స్వైర విహారం
NEWS Dec 08,2024 10:56 am
ఆర్మూర్ పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొత్తబస్టాండ్, జిరాయత్‌నగర్, గోల్ బంగ్లా, పోచమ్మగల్లీ, దయానంద్ నగర్, హుస్నాబాద్ కాలనీలో గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడుల చేస్తున్నాయి. కుక్కల బెడదతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వీధి కుక్కల దాడిలో 15 మంది గాయాలపాలయ్యారు. 36వ వార్డులో 11 మంది, 35వ వార్డులో నలుగురు కుక్క కాట్లకు గురయ్యారు. ఇందులో ఐదుగురు పిల్లలు, ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.