శాంతి భద్రతలు కాపాడటంలో హోంగార్డుల పాత్ర కీలకం
NEWS Dec 08,2024 11:01 am
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ రైసింగ్ డే వేడుకల్లో ఏఆర్ డీఎస్పీ యాకుబ్ రెడ్డి పాల్గొని హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించినందుకు పలువురికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.