విశ్వాన్ని పరుగెత్తించే శక్తి సైన్స్‌కే ఉంది
NEWS Dec 08,2024 11:01 am
విశ్వాన్ని పరుగెత్తించే శక్తి సైన్స్‌కు మాత్రమే ఉందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ సైన్స్‌ఫెయిర్ ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో పోచారం మాట్లాడుతూ.. సైన్స్‌ఫెయిర్‌కు 560 ప్రాజెక్టులు వచ్చాయంటే దాని వెనుక సైన్స్ ఉపాధ్యాయుల కృషి ఎంత ఉందో అర్థమవుతోందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి తాను సహకారం అందిస్తామన్నారు.