విజయసాయి రెడ్డిపై సీపీకి ఫిర్యాదు
NEWS Dec 08,2024 07:54 am
సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేయడం దారుణమని పేర్కొన్నారు. వెంటనే విజయ సాయి రెడ్డిని అరెస్ట్ చేయాలని వెంకన్న డిమాండ్ చేశారు.