కరాటే విద్యార్థులకు MLA అభినందనలు
NEWS Dec 08,2024 09:22 am
మెట్‌పల్లి: ఇటీవలే జరిగిన అంతర్జాతీయ జపాన్ కరాటే బ్రౌన్ బెల్ట్ జేకేఏ ఇండియా షోటోఖాన్ కరాటే అసోసియేషన్ జపాన్ బ్రౌన్ బెల్ట్ పరీక్షకు ఎంపికైన మెట్‌పల్లికి చెందిన 9 మంది కరాటే విద్యార్థులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అభినందించారు. కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, వంశీ నాయుడు, నవీన్, పవన్ కళ్యాణ్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సురేందర్, శివ, అరుణ్, ఆల్ రౌండర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.