బీజేపీ కార్పొరేటర్ పై ఆర్ఎస్పీ ఫైర్
NEWS Dec 08,2024 03:54 am
ఆర్కే పురం బీజేపీ కార్పొరేటర్ ధీరజ్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమ పార్టీకి చెందిన నేత ఉషా దాసరి తండ్రిపై హత్యాయత్నానికి పాల్పడడం పట్ల మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు