‘APలో 3వేల మంది బాలికల అదృశ్యం’
NEWS Dec 08,2024 03:21 am
AP: రాష్ట్రంలో 3వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని అందిన ఫిర్యాదు విషయంలో సీఎస్‌కు NHRC సమన్లు జారీ చేసింది. దీనిపై నివేదికలు పంపాలని రిమైండర్లు పంపినా స్పందించకపోవడంపై మండిపడింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో జనవరి 20లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బాలికల మిస్సింగ్‌పై ఓ ఇంగ్లీష్ డైలీ వార్త ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త గత జనవరిలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.