‘పుష్ప-2’ అంటే నేషనల్ నం.1
NEWS Dec 08,2024 03:18 am
భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా ₹500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘పుష్ప-2’ రికార్డు సృష్టించింది. అలాగే హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల (₹131కోట్లు) రికార్డు నెలకొల్పింది. తొలి 2 రోజుల్లోనే ₹449 cr రాబట్టిన ఈ మూవీ, మూడో రోజు దేశవ్యాప్తంగా ₹120కోట్ల వరకూ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. 3వ రోజు సౌత్ (₹45cr) కంటే నార్త్‌లోనే (₹75cr) ఎక్కువ వసూళ్లు వచ్చాయి.