కుంభమేళా కోసం బాబుకు ఆహ్వానం
NEWS Dec 08,2024 03:04 am
ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో యూపీలో నిర్వహించే మహా కుంభమేళాకు రావాలని కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయన వెంట మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నారు.