సేవారత్న అవార్డుకు ఎంపికైన కృష్ణంరాజు
NEWS Dec 08,2024 10:38 am
పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరివాడుగా గుర్తింపు పొందిన ఆత్రేయపురం గ్రామానికి చెందిన చేకూరి కృష్ణంరాజుకు ఉత్తమ జాతీయ సేవారత్న పురస్కారం లభించింది. అంతర్జాతీయ సామాజికవేత్తల దినోత్సవం పురస్కరించుకుని పాన్ ఇండియా సోషల్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ హోటల్ ఐలాపురం లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చేకూరి కృష్ణంరాజుకు ఈ అవార్డును పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు.