మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం
NEWS Dec 07,2024 01:39 pm
ఈనెల 9న సచివాలయంలో ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. తనకు శాలువా కప్పి సన్మానించారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారులకు స్వయంగా భోజనం వడ్డించారు కేసీఆర్. తన ఆతిథ్యపు అలవాటును చాటుకున్నారు.