దుకాణాలపై తనిఖీలు చేసిన అధికారులు
NEWS Dec 07,2024 12:38 pm
మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని సుమారుగా 6000 రూపాయలు జరిమానాలు విధించారు. బట్ట సంచుల వాడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్,మున్సిపల్ సిబ్బంది జగదీష్, రాజు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దీనిని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేధం అన్నారు.