3లక్షలు ఇచ్చి.. నిజాయితీ చాటుకున్నారు
NEWS Dec 07,2024 12:37 pm
మెట్పల్లి పట్టణంలోని మారుతి మసాలా దుకాణం ముందు రోడ్డుపై డబ్బులు రూ.3 లక్షలు పడి పోయాయి. ఆ డబ్బులను షాపు యజమానులైన సామ మారుతి, కంభంపాటి కిరణ్ కుమార్ తీసుకొని మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డికి శనివారం అప్పగించారు. నిజాయితీగా డబ్బులు అప్పగించిన ఇద్దరు వ్యక్తులను సీఐ నిరంజన్ రెడ్డి అభినందించారు.