చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి
NEWS Dec 07,2024 12:36 pm
మెట్ పల్లి పట్టణంలో ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా పట్టణంలోని 25, 26వ వార్డులలో ఉన్న సెంటర్ పాయింట్ల వద్ద ప్రజలు వేసిన చెత్తను తీయించి అక్కడ చెత్త పడేయకుండా ముగ్గులు వేయించారు. ప్రజలు దీనిని ఆదర్శంగా తీసుకొని సెంటర్ పాయింట్ల వద్ద చెత్త వేయకూడదని కోరారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.