ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్
NEWS Dec 07,2024 07:56 am
ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో బైక్ యాత్ర నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో బైక్ యాత్ర నిర్వహించామని తెలిపారు.