తెలంగాణ ఆనవాళ్లు మాయం
NEWS Dec 07,2024 05:01 am
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నాడని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. తెలంగాణ తల్లి కిరీటం, కడియాలు లేకుండా చేశారని వాపోయారు. బతుకమ్మ, చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం చేశారంటూ మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బండకేసి కొట్టడం ఖాయమని అన్నారు కేటీఆర్.