తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Dec 07,2024 04:52 am
తిరుమల శ్రీవారిని 75,782 మంది దర్శించుకున్నారు. 26,057 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల రూపేణా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా దర్శనం కలుగుతుందని తెలిపారు.