17 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి
NEWS Dec 07,2024 12:44 am
తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయ ప్రాంగణంలో 17 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటన తిలకంతో సగటు తెలంగాణ ఆడపడుచుకు ప్రతిబింబంగాతెలంగాణ తల్లిని రూపొందించారు. చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు.