రాల్ ప్రో టెక్నో క్రాఫ్ట్స్ కంపెనీ మూసివేత
NEWS Dec 06,2024 01:07 pm
సంగారెడ్డి జిల్లా తుర్కల ఖానాపూర్‌లోని రాల్‌ప్రో టెక్నో క్రాఫ్ట్స్ ఎల్‌ఎల్‌పీకి బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి. అక్రమాలకు పాల్పడుతూ నక్క వాగులోకి శుద్ధి చేయని వ్యర్థ పదార్థాలను డంపింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగింది టీజీపీసీబీ. వెంటనే కంపెనీని మూసి వేయాలని ఆదేశించింది.