పథకం ప్రకారమే బియ్యం మాఫియా
NEWS Dec 06,2024 12:59 pm
గత వైసీపీ సర్కార్ పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించారని ఆరోపించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు. ప్రధాన సూత్రదారి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని మండిపడ్డారు. వీరికి వత్తాసు పలికాడని, ఇందులో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వాటా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తమ సర్కార్ విచారణకు ఆదేశించిందన్నారు.