కాంగ్రెస్ వచ్చాకే కొలువుల పండుగ
NEWS Dec 06,2024 12:12 pm
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సర్కార్ పై భగ్గుమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గాలికి వదిలేసిందన్నారు. నిరుద్యోగులకు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక TGPSCను ప్రక్షాళన చేశామన్నారు. రాబోయే రోజుల్లో UPSC స్థాయికి తీసుకు వస్తామన్నారు. ఇప్పటి దాకా 50 వేలకు పైగా జాబ్స్ భర్తీ చేశామన్నారు.