Logo
Download our app
అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించుకున్న‌ స్పీకర్
NEWS   Dec 06,2024 06:37 am
రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆయనకు ఈవో వేండ్ర త్రినాధ రావు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయగా వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని చైర్మన్ ఐవి రోహిత్, ఈవో త్రినాధరావులు అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source