25 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల
NEWS Dec 06,2024 06:37 am
యాసంగి పంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది ప్రాజెక్ట్‌లోకి భారీ వరద రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా ఉంది.ఆయకట్టుకు ఈ నెల 25 నుంచి వారబందీ ప్రకారం కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రాజెక్ట్ అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా జోన్-1, జోన్-2గా ఆయకట్టును నిర్ణయించారు. దీంతో జోన్-1కి ఏడు రోజులు, జోన్-2కి 8 రోజులపాటు నీటిని విడుదల చేయనున్నారు.