కాలిఫోర్నియాలో భారీ భూకంపం
NEWS Dec 06,2024 03:25 am
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. 7.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నిర్దారించారు. ఇది శాంటాక్రజ్ వరకు కొనసాగింది. 5.3 మిలియన్ల మంది భయాందోళనకు గురయ్యారు. చాలా మంది ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. ఫెర్నెడేల్ కు పశ్చిమాన ఉదయం 10.44 గంటలకు భూకంపం చోటు చేసుకుందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.