మెట్ పల్లి పట్టణంలో బాలిక అదృశ్యం
NEWS Dec 05,2024 05:29 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఓ మైనర్ బాలిక అదృశ్యం అయింది. పట్టణంలోని ఓ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని అదే పాఠశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఆమె స్నేహితులను కలిసి వస్తానని వెళ్లి తిరిగి రాలేదని హాస్టల్ వార్డెన్ తమకు చెప్పారని బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ టీవీ పరిశీలిస్తున్నారు.