రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి స్వాగతం
NEWS Dec 05,2024 02:36 pm
నిజామాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ తదితరులున్నారు.