మరాఠా సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
NEWS Dec 05,2024 01:11 pm
మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కొలువు తీరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పీఎం మోడీ. ముకేశ్ అంబానీ, సచిన్ తో పాటు బాలీవుడ్ నటులు షారుక్ కాన్, సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్, రణ వీర్ సింగ్ పాల్గొన్నారు.