శ్రీశైలం ఈవోగా శ్రీనివాసరావు
NEWS Dec 05,2024 10:47 am
శ్రీశైలం దేవస్థానం నూతన ఈవోగా గురువారం బాధ్యతలు చేపట్టారు డిప్యూటీ కలెక్టర్ ఎం. శ్రీనివాసరావు. పుణ్య క్షేత్రాన్ని అభివృద్ది చేసేందుకు తనకు సీఎం అవకాశం ఇచ్చారని అన్నారు. అందరూ కలిసికట్టుగా ఆలయ అభివృద్దికి కృషి చేయాలని కోరారు. సంక్రాంతి, మహా శివ రాత్రి, ఉగాది మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.