భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల్లో గాయత్రి విద్యార్థులు ఎంపిక
NEWS Dec 05,2024 02:24 pm
గీతా జయంతి సందర్భంగా గీతా ప్రచార సమితి, ఆధ్వర్యంలో గోదావరిఖని లో నిర్వహించిన జిల్లా స్థాయి భగవద్గీత శ్లోక కంఠస్త పోటీల్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన విద్యార్థులు పాల్గొని తమ అద్భుతమైన గాత్రంతో శ్లోకాలను వీనులవిందు ఆలపించి ఉన్నత వర్గం విభాగం లో 9 వ తరగతి కి చెందిన పూరెళ్ళ హన్విత ప్రథమ బహుమతి, చంద్రకారి లయవర్ధిని కన్సోలేషన్ బహుమతి, మాధ్యమిక విభాగంలో 7 వ తరగతి విద్యార్థి కొమురవెల్లి కార్తీక్ ప్రథమ బహుమతి, గాయత్రి ప్రిన్సిపల్ అభినందించారు.