హరీశ్ ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
NEWS Dec 05,2024 07:34 am
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి హరీశ్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాఫ్తులో పోలీసులకు సహకరించాలని హరీశ్ రావుకు సూచించింది. ఈ వ్యవహారానికి సంబంధించి చక్రధర్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది.