రోడ్డును తొలగించి అక్రమంగా ఇళ్ల నిర్మాణం
NEWS Dec 05,2024 07:13 am
రొళ్ల మండలం బంద్రేపల్లి గ్రామ సమీపంలో స్థలాన్ని ఆక్రమించి రోడ్డుపైనే నిర్మాణాలు చేపడుతున్నారు. అదే గ్రామానికి చెందిన నరసింహప్ప హనుమంతరాయప్ప తన ఇంటి నిర్మాణoను రోడ్డును తొలగించి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో ఎటు పాఠశాలకు వెళ్లాలో తెలియక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకొని అక్రమంగా ఇళ్ల నిర్మిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.