హిందువులపై దాడులు అరికట్టాలని నిరసన
NEWS Dec 04,2024 01:25 pm
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని తుని పట్టణంలో బిజెపి, సంఘ్ పరివార్, హిందు సంఘాలతో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ గా తరలి వెళ్లి స్థానిక తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికు తీసుకెళ్లాలని కోరారు.