రెసిడెన్షియల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Dec 04,2024 05:01 pm
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్, వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, నూనె.. పరిశీలించారు.